BREAKING
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కష్టకాలంలో పార్టీ తండాను మోసిన ప్రతి కార్యకర్తలు పార్టీ ఎప్పటికీ మర్చిపోదు ఎప్పటికీ

Select Suryaa Now
కష్టకాలంలో పార్టీ తండాను మోసిన ప్రతి కార్యకర్తలు పార్టీ ఎప్పటికీ మర్చిపోదు ఎప్పటికీ

వేముల మేజర్ న్యూస్:::---
కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎప్పటికీ మరిచిపోదు అని వైఎస్ఆర్సిపి వేముల మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి,వేముల మాజీ జడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి,మాజీ పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,మాజీ ఎంపీటీసీ వనిపెంట రామచంద్ర రెడ్డి,వెంకట రామిరెడ్డి,మాజీ సర్పంచ్ రామలక్షుమ్మ అన్నారు.వేముల మండలంలోని పెద్దజూటూరు, సిద్ధంరెడ్డిపల్లి,కుప్పగుట్టపల్లి,ఎద్దులయేని గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలకు బుధవారం సాయంకాలం పెద్దజూటూరు గ్రామంలో ఐడీ కార్డులను వైఎస్ఆర్సిపి వేముల మండల కన్వీనర్ నాగెళ్ళ సాంబశివరెడ్డి,వేముల మాజీ జడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి,మాజీ పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,మాజీ ఎంపీపీ చల్లా వెంకట నారాయణ,మాజీ ఎంపీటీసీ వనిపెంట రామచంద్ర రెడ్డి,వెంకట రామిరెడ్డి,మాజీ సర్పంచ్ రామలక్షుమ్మ ఆద్వర్యం లో
కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం గ్రామస్థాయిలో నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంతో పాటు,పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఐడీ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని,నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకెళ్లి,కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నారు, కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని, దౌర్జన్యం చేసినా  ఎదురొడ్డి నిలవాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఎంపీటీసీ సర్పంచి స్థానాలు గెలిచి కానుకగా ఇచి,వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగేళ్ల మహేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వరరెడ్డి,భాస్కర్‌రెడ్డి,వై.లక్ష్మిరెడ్డి,సాంబశివరెడ్డి,విజయభాస్కర్‌రెడ్డి,ఎన్.సూర్యనారాయణరెడ్డి,వీరరాఘవరెడ్డి,అన్నారెడ్డి శివారెడ్డి,కె.రవిశంకర్‌రెడ్డి,నారాయణ స్వామి, యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు చల్లా సునీల్ కుమార్,పిబివి భాస్కర్ రెడ్డి,హరి,
ప్రేమసాగర్,
తో పాటు ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.