కన్నకూతురిపై అత్యాచారం.. తండ్రి జీవితాంతం జైల్లోనే...!
గుంటూరు: మoగళదాస్ నగర్ లో 13 ఏళ్ల కుమార్తె పై లైంగిక దాడి చేసిన తండ్రి, ఆటో డ్రైవర్ గరికపాటి పవన్ కు జీవితకాలం కారాగార శిక్ష విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం బుధవారం తీర్పు చెప్పారు. 2020 సెప్టెంబర్లో బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. తల్లి గమనించి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీపీ తీగల దుర్గాప్రసాద్ నేరం రుజువు చేయగా.. బాలికకు రూ.5లక్షల పరిహారానికి సైతం జడ్జి ఆదేశించారు
కే నాగరాజు గుంటూరు క్రైమ్