కనకవీరుడు విద్యా కమిటీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర
కనకవీడు విద్యా కమిటీ ఎన్నికల ఉత్కంఠకు తెరా
.. ఎమ్మెల్యే బీవీకి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ
ఎమ్మిగనూరు టౌన్, సూర్య
నందవరం మండలంలోని కనకవీడు గ్రామంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడింది అధికార పార్టీకి చెందిన వారు విద్యా కమిటీ లో చైర్మన్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డికి ఆ గ్రామ సీనియర్ నాయకులు కర్ణం రఘుమూర్తి తో కలిసివచ్చి ఘనంగా సన్మానించారు.గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కనకవీడు గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.