కనకమహాలక్ష్మి ఆలయంలో పర్సంటేజ్ కలకలం!
విశాఖపట్నం, సూర్య : కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అభివృద్ధి పనులు చుట్టు కొత్త వివాదం తల పైకి వస్తుంది. రూ. 43.50 లక్షల అంచనా వ్యయంతో అన్నదాన భవనం మేడ పైన చేపట్టనున్న నిర్మాణ పనులు సోమవారం తణుకు శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో పాలకమండలంలోని కొంతమంది సభ్యులు వ్యవహార శైలిపై దేవస్థానంలో చర్చ మొదలైంది. అభివృద్ధి పనుల్లో పర్సంటేజ్ కోసం కొంతమంది సభ్యులు పావులు కదుపుతున్నట్లు పాలకవర్గం సభ్యులు వినిపిస్తున్నా యి. పదవిలోకి వచ్చిన నాటి నుంచి ఆదాయ మార్గ అన్వేషణలో కొంతమంది సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. అమ్మవారు దేవాలయాల్లో దర్శనాలు,పూజలతో సంతృప్తి చెందని కొంతమంది కూటమి ప్రతినిధులు ఆదాయ మార్గాలపై స్కెచ్ వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. అన్నదాన భవనంలో 43 లక్షలకు పైగా పనులకు శంకుస్థాపనతో కొంతమంది సభ్యులు దీనిపై ఆరాధిస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో గుప్పుమంటుంది. టెండర్ల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగి కమిషనర్ కార్యాలయం ఆదేశాలతో అన్నదాన భవనం నాడపైన అభివృద్ధితోపాటు, జి ఈ షెడ్ నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్ కూడా జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఈ పనుల్లో పర్సంటేజ్ లపై కాంట్రాక్టర్ తో మంతనాలు జరుపుకున్నట్లు సీనియర్ ఉద్యోగులు గుసగుసలాడుకోవడం గమనార్హం. దీనిలో సక్సెస్ అయితే రానున్న మార్గశిర మాస ఉత్సవాల్లో మరింత ఆర్థిక లాభం కలిగే అవకాశాలు ఉన్నాయని పాలకవర్గంలోని కొంతమంది స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ పాలకమండలి ఆశావహులకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.