కమలాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్ దంపతులు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : సీనియర్ నాయకులు, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త కోడూరు కమలాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి దంపతులు నెల్లూరు మాగుంట లేఔట్ లోని వారి నివాసంలో శాలువా, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి ఆయురారోగ్యాలు, సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, అలాగే ప్రజాసేవలో మరింత ముందుకెళ్లి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, టిడిపి నాయకులు ఉన్నారు.