సౌత్ ఆములూరులో సోమిరెడ్డి మాటామంతి
గ్రామంలో పర్యటించిన టీడీపీ యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్: తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ యువనాయకులు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలపై ఆరా
గ్రామంలో పర్యటించిన నాయకులు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. గ్రామంలో మౌలిక వసతులు, స్థానిక అవసరాలకు సంబంధించిన అంశాలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శృతి హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
టీడీపీ సీనియర్ నాయకుడికి పరామర్శ
అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మద్దెన గోపాలనాయుడిని వారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.