BREAKING
కరువు సీమకు కొత్త కిరీటం ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం --గాంధీ విగ్రహానికి వినతిపత్రం నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం

ఆత్రేయపురం మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, పలుచోట్ల పూలమాలలతో నివాళులు

Select Suryaa Now
 ఆత్రేయపురం మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, పలుచోట్ల పూలమాలలతో నివాళులు

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆత్రేయపురం మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, తాడిపూడి గ్రామం, మహాత్మా గాంధీ కళాశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు గాంధీజీకి నివాళులు అర్పించారు.

మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పి.వి.ఆర్.కె.రాజు, పరిపాలనాధికారి వి.రామస్వరూప్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆత్రేయపురం స్పెషల్ ఆఫీసర్ కోదండ రామ చౌదరి, సబ్ రిజిస్ట్రార్ రత్నకుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తాడిపూడి గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణంరాజు, గ్రామస్థులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ పి.ఎస్.రాజు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి గొప్ప విలువలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని వక్తలు పేర్కొన్నారు.