కావలిలో జోరు పెంచిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి.. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ!
ఎమ్మెల్యే సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న 13వ వార్డు ముఖ్య నేతలు … కావలి అభివృద్ధి కోసం కావ్యతో కలిసి నడుస్తాం.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
కావలి, మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో చేరికల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో పట్టణంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కావలి పట్టణం 13వ వార్డుకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు మన్నెమాల శ్రీనివాసులు రెడ్డి, మన్నెమాల వెంకటరమణారెడ్డి తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీనికి ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.పార్టీలో చేరిన మన్నెమాల శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంపై విశ్వాసంతోనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. కావలి పట్టణ, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు జ్యోతి బాబురావు, అమర వేదగిరి గుప్తా, గాధం శెట్టి వేణుగోపాల్,పృద్వి, గాధం శెట్టి వంశీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.