ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి
ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి
తిరుపతి, (రేణిగుంట) మేజర్ న్యూస్: తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తరుణ్ అనే విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తిరుపతి ఎంఆర్ పల్లికి చెందిన బయట వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో తరుణ్ గాయపడటంతో తోటి విద్యార్థులు 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
రిపోర్టర్: రమేష్ బాబు కొండల