BREAKING
వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి -

కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’

Select Suryaa Now
కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’

 విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ చేసిన కమిషనర్, అబ్దుల్ రషీద్    చిన్ననాటి నుంచే పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని పిలుపు.
​కావలి మేజర్ న్యూస్  :    భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు, పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు స్వచ్ఛతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఎంపిక చేశారు. విజేతలకు మున్సిపల్ కమిషనర్ ఎస్.డి. అబ్దుల్ రషీద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.  ​ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశుభ్రత, స్వచ్ఛతా కార్యక్రమాలపై సరైన అవగాహన పెంపొందించుకోవాలని, బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొన్నారు.  ​ఈ కార్యక్రమంలో పట్టణంలోని నారాయణ, భాష్యం, నలంద, కాకతీయ, జయఉష, ఆర్.ఆర్. పబ్లిక్ స్కూళ్లు, మున్సిపల్ హైస్కూల్ (ఓల్డ్ టౌన్), జెడ్పీపీ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, శ్రీ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల (వెంగళరావు నగర్), సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్, 8వ వార్డు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎండీ. బషీర్, స్వర్ణ, వార్డు శానిటేషన్ కార్యదర్శులు, శానిటరీ మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.