జోరందుకున్న ఎంపిటిసి నామినేషన్లు
పాలకొండ, సూర్య : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పాలకొండ మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. నామినేషన్లకు గడువు ముగింపు దశకు చేరుతున్న వేళ అభ్యర్థులు తమ క్యాడర్ తో కలిసి పెద్ద ఎత్తున పాలకొండ ఎంపీడీఓ కేంద్రం వద్దకు చేరుకొని తమ నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తమపట్టు నిలబెట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్డులు సిద్ధమవుతున్నారు. కూటమి తరపున పాలకొండ మండలం తంపటాపల్లి ఎంపీటీసీ అభ్యర్దిగా గొర్లె వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేసారు, ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నిమ్మక. జయ కృష్ణ, జాడ శ్రీధర్,గ్రామస్తులు,కూటమి కార్యకర్తలు ఆమె వెంట తరలివచ్చి భారీగా పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.