BREAKING
చదువుతోనే ఉన్నత స్థానం.. -ఎస్సై తోట తిరుపతి -పోలీసు విధులు,చట్టాలపై విద్యార్థులకు అవగాహన.. అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే శంబంగి ఆశీస్సులు

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే శంబంగి  ఆశీస్సులు

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి నియోజకవర్గం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గెలుపు తధ్యం అని మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు 
జగన్నాథపురం, చింతాడ గ్రామ పంచాయతీలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్న సందర్భంగా, బొబ్బిలి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు  అభ్యర్థులకు తమ ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా బొబ్బిలి జడ్పీటీసీ అభ్యర్థి శంబంగి వేణుగోపాల్ నాయుడు ని, అలాగే వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బొబ్బిలి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బొబ్బిలి జడ్పీటీసీ అభ్యర్థి  శంబంగి వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో బొబ్బిలి నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జగన్నాథపురం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

రైతులకు యూరియా కూడా సక్రమంగా అందని పరిస్థితులు నెలకొన్నాయని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని అన్నారు. పేదలకు కొత్త ఇళ్ల మంజూరు విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు పరిశీలించాలని కోరారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ అభ్యర్థి శంబంగి వేణుగోపాల్ నాయుడు ని, ఎంపీటీసీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బొబ్బిలి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ బొద్దల సత్యనారాయణ, బొబ్బిలి మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు తమ్మిరెడ్డి దామోదరరావు, సంబంధిత గ్రామాల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.