BREAKING
బీజేపీ కార్యకర్తలతో పాటు మన్ కి బాత్ వీక్షించిన ఎంపీ అరుణ 14వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ ప్రజలతో ముఖాముఖి ఆదరించండి..అండగా ఉంటా.. -కొత్తపల్లి ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ రేపే ‘అర్నాబ్’ తుఫాన్‌గా తీవ్రరూపం * ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన.. అభిమానులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఎం వి ఆర్ పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. విమానంలో ఒంటరిగా ఏడ్చిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగం! సేవా మిత్ర. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ మొక్కలు పంపిణీ సీబీఎఫ్‌సీ డేటా లీక్ కలకలం.. 500లకు పైగా సినిమాల సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతం! క్యూర్ పరిధిలో ప్రయాణికులకు టీ జీ ఎస్ ఆర్ టీ సీ సరికొత్త కానుక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ 35వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం మీ ఇంటి ఆడపడుచు గా ఆశీర్వదించండి -మారుతి నగర్ ప్రచారంలో గాలి కావ్య మైనారిటీ యువత టీడీపీలో చేరిక యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం

జీలుగుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Select Suryaa Now
జీలుగుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మసీదు సెంటర్ సమీపంలోని జాతీయ రహదారిపై రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో టి. నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ధారావతు భద్రం (60), బుట్టాయిగూడెం మండలం జోడేబోడె గూడెం గ్రామానికి చెందిన సింధూర్ (33) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రిపోర్టర్: బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా.