BREAKING
పెద్దపల్లిలో వైభవంగా దసరా వేడుకలు: 35 అడుగుల రావణ దహనానికి ముస్తాబు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు కుటుంబ సమేతంగా తరలిరావాలని ప్రజలకు ఆహ్వానం రామప్ప ను సందర్శించిన విదేశీయులు *లక్ష్మీదేవికి కుంకుమార్చనలు.. భక్తిశ్రద్ధలతో పూజలు** **దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు** లేని ప్రాజెక్టు పేరుతో సీతక్క ఇసుక దోపిడి-బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ఘనంగా దసరా బేస్తం చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కమిషనర్ వెంకన్న తో కలిసి పరిశీలించిన గుండు చందన పూర్ణచందర్ గీతం జాతీయ ఏఐ ఛాలెంజ్ 2026 రూ. 20 లక్షల వరకు నగదు పురస్కారాలు తొలి బహుమతిగా రూ.9 లక్షలు యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం - బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కాండిడేట్ రావు పద్మా రెడ్డి మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్-సమ్మెకు సంపూర్ణ మద్దతు 28 వార్డు హరిజన లక్ష్మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయదుర్గం పెనుగొండలో మున్సిపల్ అభ్యర్థి ఎన్నికలు చెలరేజ్ గిన అసంతృప్తి ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ప్రకటించాలి పంతంగి టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ

Select Suryaa Now
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ
– గ్రామపంచాయతీల వారీగా గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

గుడిబండ మేజర్ న్యూస్:
గుడిబండ మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలతో మమేకమై, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించాలని చర్చించారు. ఎంపీటీసీ స్థానాలకు తగిన అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించి, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శివకుమార్, మాజీ సర్పంచ్ కరుణాకర్, మండల కన్వీనర్ డి.ఎల్. గౌడ్‌ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు బి హెచ్ రాయుడుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుడిబండ రిపోర్టర్ దేవరాజు