జర్నలిస్టులపై దాడులు అరికట్టాల్సిందే. - గొట్టిపాటి నాగేశ్వరరావు ఎస్ వి బ్రహ్మం డిమాండ్. -బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా.
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి నాగేశ్వరావు , ఎస్ వి బ్రహ్మం డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేసేందుకు తెగబడిన పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్కాన్ జర్నలిస్ట్ అసోసియేషన్లు పిలుపుమేరకు బుధవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గొట్టిపాటి నాగేశ్వరావు ఎస్ వి బ్రహ్మం మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోని అక్రమాలపై ప్రశ్నిస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న ఉపాధ్యాయులు, రచయితలు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ ప్రతిపక్ష పార్టీల ఆందోళన సమాచారాన్ని చేరవేసేందుకు వెళ్లిన, వెళుతున్న జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టి నిర్బంధించే ప్రయత్నం చేసిన పోలీసుల వైఖరి గర్హనీయమన్నారు. మీడియా అని చెబుతున్నప్పటికీ వినకుండా పలువురు జర్నలిస్టులను అనేక చోట్ల న్యూఢిల్లీలో పోలీసులు నిర్బంధించటమే కాక దురుసుగా వ్యవహరించారని విమర్శించారు.
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ వైఖరికి నిరసనగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టామన్నారు. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎటాక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు కలెక్టరేట్ పరిపాలనాధికారి రవికుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాకు మద్దతుగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఓ పి డి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ మద్దతు తెలియజేశారుకార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి. భక్తవత్సలం, జిల్లా కార్యదర్శి దాసరి సునీల్, మీడియా ఇన్ఛార్జ్ ఎల్. రాజు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా,టీవీ 9 స్టాఫ్ రిపోర్టర్ ఫై రోజ్ బేగ్, టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ ఎన్ జనార్దన్ రావు, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాస్, పి9 టీవీ మేనేజింగ్ డైరెక్టర్ పి. కిరణ్, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్చార్జ్ పి.వి భాస్కర్ రెడ్డి, ఓ జి మీడియా ప్రతాపరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు ఆర్ వి రాజశేఖర్, డి జె ఎఫ్ కన్వీనర్ బొడ్డు శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, సురేష్, బ్రహ్మయ్య, సిహెచ్ నరసింహారావు, జె ఏడుకొండలు, వెంకటేశ్వర రెడ్డి, సురేష్, సీనియర్ కెమెరామెన్ టి. బాలాజీ కుమార్, వీడియో జర్నలిస్టులు టి.రాజు, రామరాజు, శివరాం, నక్క వాసు, కొండారెడ్డి, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.