BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గర్భిణీలు,బాలింతలు ఐవిఆర్ఎస్ వైద్య సేవలు పొందండి:ఐసిడిఎస్ సూపర్వైజర్ బి విజయలక్ష్మి ఎస్‌ఐఆర్‌లో పెండింగ్ నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూర్య మసాలా కంపెనీపై కాలుష్య ఆరోపణలు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలిపెండింగ్‌ బకాయిల చెల్లింపునకు రోడ్‌మ్యాప్‌ విడుదల చేయాలి ఎస్‌టీయూ డిమాండ్‌ ఎముకలు బలంగా మారాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. కాల్షియం, విటమిన్ డి కోసం ఇవి తినండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఘన సన్మానం బాలలు నేరాల బాట పట్టకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి..... నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు.. ఎంత తీసుకున్నాడంటే? ఈ-చలనా విధానాన్ని రద్దు చేయాలి - ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కలిసిన వీఆర్‌ఏలు నువ్వూరుపాడు స్కూల్ విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి ఇంటి పన్నులో డోర్ నెంబర్ తోపాటు యజమాని పేరును చేర్చాలి - సిపిఎం డిమాండ్ నెల్లిమర్లలో టీడీపీ జోరు.. ఎస్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం

జనసేనలోకి తాడివలస జయప్రకాష్.. కండువా కప్పి ఆహ్వానించిన గురాన అయ్యలు

Select Suryaa Now
జనసేనలోకి తాడివలస జయప్రకాష్.. కండువా కప్పి ఆహ్వానించిన గురాన అయ్యలు

 

విజయనగరం అక్టోబరు 1, మేజర్ న్యూస్:

విజయనగరం 18వ వార్డుకు చెందిన  నాయకుడు తాడివలస జయప్రకాష్ గురువారం జనసేన పార్టీ సీనియర్ నేత గురాన అయ్యలు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌కు గురాన అయ్యలు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు వార్డుకు చెందిన సుమారు 30 కుటుంబాల వారు కూడా జనసేనలో చేరారు.

తాడివలస జయప్రకాష్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 22వ వార్డు ఇన్చార్జీగా , తెలుగుదేశం పార్టీ తరపున 11వ వార్డు ప్రెసిడెంట్‌గా   బాధ్యతలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా జనసేన నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాసేవలో మంచి పేరు ఉన్న తాడివలస జయప్రకాష్ జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది నాయకులు, కుటుంబాలు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. 18వ వార్డు పరిధిలో జయప్రకాష్  అనుభవంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి అందరం కలసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఆశయాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరుతున్నట్లు తాడివలస జయప్రకాష్ తెలిపారు.  18వ డివిజన్‌లో జనసేన జెండాను ఎగురవేసేందుకు, ప్రజల సమస్యల సాధనకు నిరంతరం శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రవితేజ , టి. శ్రీనివాసరావు, పి. అప్పలరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.