ఈ-చలనా విధానాన్ని రద్దు చేయాలి - ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు
గూడూరు, మేజర్‌న్యూస్ : వాహనాలకు విధిస్తున్న ఈ-చలనా విధానాన్ని రద్దు చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కె నారాయణ డిమాండ్ చేశారు. గురువారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటియుసి అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఈ చలానా వసూళ్లకు కరెంట్ మీటర్‌ను రద్దు చేయడం ఎంత వరకు సబబన్నారు. భారీ పెనాలిటీలు పెంచే జీవో నెంబర్ 21, 31 లను రద్దు చేయాలన్నారు. పెట్రోల్ , డీజిల్‌లను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి జి శశి కుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ , బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మీరా, ఆటో యూనియన్ నాయకులు ముని, మల్లి, చెంచు కృష్ణ , ఆనంద్, రాజు, తదితరులు పాల్గొన్నారు.