నువ్వూరుపాడు స్కూల్ విద్యా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : నువ్వూరుపాడు ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ విద్యా కమిటీ ఎన్నికలు గురువారం ఏకగ్రీవంగా జరిగాయి . రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి , ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి , ఆత్మకూరు మండల యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి సూచనల మేరకు నువ్వూరుపాడు ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్‌లో విద్యా కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్‌గా దేవరపాటి వసంత, వైస్ చైర్మన్‌గా దేవరపాటి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ దేవరపాటి బాలకొండయ్య, పాఠశాల హెడ్‌మాస్టర్ తిరుపాలు, ఉపాధ్యాయులు తుమ్మల గంగాధర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు పలువురు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం మెరుగుపడేలా విద్యా కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.