కూటమిలో సీట్ల గలాటా... తగ్గేదే లేదంటున్న జనసేన రెబల్స్
గుంటూరు మేజర్ న్యూస్
కూటమి ప్రభుత్వం పొత్తు ధర్మాన్ని పాటించకుండా తమకు తీవ్ర అన్యాయం చేసిందని జనసేన నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు,రెబెల్ అభ్యర్థులుగా దిగిన పలువురు జనసేన నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పొత్తు ధర్మంలో భాగంగా తమకు సీట్లు కేటాయిస్తామని నమ్మబలికి,చివరకు పక్క పార్టీలో నుండి వచ్చిన వారికి సీట్లు కేటాయించి తమకు నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీకి అహర్నిశలు కష్టపడి,కేసులపాలైన తమరిని పక్కన వారికి నచ్చిన వారికి సీట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏదేమైనా తాము తగ్గేది లేదని,రెబల్స్ గా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు.
అనిల్ కాంత్.కె …. గుంటూరు ప్రతినిథి