జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందడి జడ్పీటీసీకి 10, ఎంపీటీసీకి 26 నామినేషన్లు
నరసరావుపేట మేజర్ న్యూస్: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మొదటి రోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఘనంగా కొనసాగింది. జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ తరఫున 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 26 నామినేషన్లు అందగా, టీడీపీ నుంచి 21, జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మొత్తం 28 జడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటివరకు టీడీపీ తరఫున 10 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి లక్ష్మయ్య వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియతో మండల పరిషత్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
రిపోర్టర్ మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..