BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

అశోక విజయ దశమి

Select Suryaa Now
అశోక విజయ దశమి

మార్టూరు, మేజర్ న్యూస్:

మండలంలోని అనంతవరం గ్రామములోని 
కొత్త కాలనీ నందు మంగళవారం అశోక విజయ దశమి నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం కి ప్రియదర్శని మహిళా మండలి అధ్యక్షురాలు డి విజయ అధ్యక్షత వహించారు.మొదట చక్రవర్తి అశోకుడు చిత్ర పటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ అశోకుడు కళింగ యుద్ధం తరువాత హింసను వీడి శాంతి మార్గాన్ని ఎన్నుకొని బౌద్ద మతాన్ని స్వీకరించిన రోజును అశోక విజయ దశమి అని పిలుస్తారు ( క్రీ. పూ 268 - 232 )  అని చెప్పారు. ప్రయివేట్ ఆడిటర్ యవణ్య మాట్లాడుతూ శాంతియుత జీవనం గడపాలి అని రాజ్యంలోని ప్రజలకు బోధించడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల యస్. టి , యస్. సి , మైనార్టీ, బి. సి ఐక్య వేదిక కన్వీనర్ రాము మాట్లాడుతూ క్రీస్తు పూర్వమే బౌద్ధం ప్రపంచానికి శాంతిని నేర్పించింది అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి చాక్లెట్లు, స్వీట్స్ పంచి పెట్టారు.కార్యక్రమంలో కాలనీ పెద్దలు తిరుపతి. సుబ్బారావు, డి. యల్. ఆనంద్,జూపల్లి పరిశుద్ధం, జె. విజయ్, టి. సువర్ణ రాజు, యం. వంశీ, కళాశాల,ఉన్నత పాఠశాల, ప్రార్ధమిక పాఠశాలల విద్యార్థులు జె. సోను రెష్మన్, శ్రావ్య,శ్రీజ, లక్కీ, శాన్వీ, చిన్న శాన్వీ తదితరులు పాల్గొన్నారు.