జనాభా గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని డి ఆర్ ఓమోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత జనగణన–2027కు సంబంధించి రెండో దశ జనాభా గణన పై జిల్లా, చార్జ్ స్థాయి అధికారుల ఈరోజు మొదటి బ్యాచ్ జనగణన ముగింపు కార్యక్రమం నిర్వహించారు. జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, అధికారుల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై గత మూడు రోజులు శిక్షణ అందించారు. శనివారం శిక్షణ ముగింపు సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ఇంతకుముందు కేవలం ఇళ్ల జాబితా మాత్రమే పూర్తి చేసుకోగా, ఈ రెండో దశలో వ్యక్తిగత జనాభా గణన నిర్వహించబడుతుందన్నారుఇందులో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, సామాజిక సాంస్కృతిక, ఆర్థిక వివరాలు సేకరించటం జరుగుతుందన్నారు. ఇవి చాలా గోప్యంగా, అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ప్రక్రియ అన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే ట్రైనర్స్, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా విధులు నిర్వర్తించేలా శిక్షణ ఇవ్వటం జరిగింది క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగా ఉపయోగపడిందని తెలిపారు.ఫేజ్ -2 జనాభా గణన ఫిబ్రవరి, 2027 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు.జనాభా గణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ముని చంద్ర, లక్ష్మీ కళ తదితరులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.