BREAKING
ఇంకొల్లు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన రెండేళ్లలో మొత్తంగా 837 మందికి రూ.7కోట్ల 22 లక్షలు దాటిన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కూకట్‌పల్లిలో గంజాయి కలకలం ట్యునీషియాలో వేగంగా క్షీణిస్తున్న పత్రికా స్వేచ్ఛ...జైలు శిక్షల భయంతో వణుకుతున్న విలేకరులు డిండి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదు స్పానిష్ ముందస్తు ఎన్నికల సర్వేలో అధికార సోషలిస్టు పార్టీ ఆధిపత్యం రోడ్లపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలు తొలగింపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎస్ఐ చంద్రకుమార్ ఎంఎల్‌ఏ బావమరిదికి నివాళులు పామూరు ముంగిట్లోకి ‘ఊపాస్‌’ ఎముకల వైద్యం! అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించనున్న బ్రిటన్ గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం కల్తీ నెయ్యి కేసులో ఈడీ సంచలనం పిన్నింటి రమణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్ బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం రణస్థలం మండలం లో అభివృద్ధి పనులకు శ్రీకారం

జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి... పిడి శారదా దేవి

Select Suryaa Now
జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలి... పిడి శారదా దేవి

బాడంగి, సూర్య : జల సంరక్షణ పనులతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని  పథక సంచాలకురాలు ఎస్‌. శారదాదేవి తెలిపారు. బుధవారం మండలంలో పర్యటించిన ఆమె గొల్లాది పంచాయతీ పరిధిలోని కామన్నవలసలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకాల పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. ప్రతి రైతు జల సంరక్షణ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోడూరు పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణవలసలో 4.50 ఎకరాల్లో చేపట్టిన పండ్ల తోటలను పరిశీలించి, ఆరుగురు రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో అనంత అరణ్య ప్లాంటేషన్‌ పనులను పరిశీలించారు.
మండల కార్యాలయంలో పథక సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో మంజూరైన జల సంరక్షణ, వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, చేపల చెరువులు, ఉద్యాన తోటల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పని కల్పించాలని, రోజువారీ సగటు వేతనం రూ.312 వచ్చేలా చూడాలని సూచించారు. పనుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కె. సాయిరాం, జేఈ ఏ. హరినారాయణ, సాంకేతిక సహాయకులు శంకరరావు, ఉమ, రామారావు, క్షేత్ర సహాయకులు ఈశ్వరరావు, పాపయ్య, సుందరాణి తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.