జాతీయసేవా పధకం ప్రారంభించిన కదిరిపార్ధసారధి:
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలంలోని కదిరిబాబురావు వ్యవసాయ కళాశాల నందు నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు తమ అభ్యసనలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ సేవాపథకం కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని శీలంవారిపల్లె గ్రామంలో కదిరిబాబురావు విద్యాసంస్థల సెక్రటరీ&కరస్పాండెంట్ కదిరిపార్ధసారధి ప్రారంభించారు.ఈసందర్భంగా ముందుగా అధ్యాపకులు విద్యార్థుల సమక్షంలో జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం పార్థసారథి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వ్యవసాయ విద్యను అందించి రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ కళాశాలను స్థాపించి విద్యార్థులకు అవసరమైన అన్ని మౌళిక వసతులు కల్పించినట్లు అన్నారు.అదేవిధంగా వ్యవసాయవిద్యను అభ్యసించిన విద్యార్థులు జాతీయ సేవాపధకం కార్యక్రమం కింద వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అదేవిధంగా గ్రామస్థులకు పరిసర ప్రాంత రైతులకు వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించి మెళకువలు తెలపాలని గ్రామస్థులు వ్యవసాయ విద్యార్థులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సహకరించి సద్వినియోగం చేసుకుని ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో కదిరిపార్ధసారధి, కళాశాల డీన్ డాక్టర్ మోషే,ఎన్ఎస్ఎస్ ఇంచార్జి స్టెఫీ,అధ్యాపకులు,విద్యార్థులు,గ్రామస్థులు పాల్గొన్నారు.