BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

ఇఫ్కో కిసాన్ సెజ్‌ పరిశ్రమలకు... విద్యుత్ వసతులపై సమీక్ష

Select Suryaa Now
ఇఫ్కో కిసాన్ సెజ్‌ పరిశ్రమలకు...  విద్యుత్ వసతులపై సమీక్ష

భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ లోడ్లను ముందుగానే అంచనా వేయాలి..  డైరెక్టర్ కె. గురవయ్య

నెల్లూరు, వేదాయపాలెం,   మేజర్ న్యూస్  :  ఇఫ్కో కిసాన్ సెజ్‌లో రానున్న పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మౌలిక వసతుల కల్పనపై ఏపీఎస్పీడీసీల్ డైరెక్టర్   కె. గురవయ్య బుధవారం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులతో ప్రత్యేకంగా  సమీక్షించారు.  ఈ సందర్భంగా సెజ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, భవిష్యత్తులో ఏర్పాటు కానున్న పరిశ్రమలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం, పరిశ్రమల స్వభావం, విద్యుత్ అవసరాలు, ప్రతిపాదిత విద్యుత్ లోడ్లు తదితర అంశాలపై ప్రతినిధులతో డైరెక్టర్ చర్చించారు.  ఇఫ్కో కిసాన్ సెజ్‌లో రాబోయే పరిశ్రమల సంఖ్య, వాటి సామర్థ్యం మరియు భవిష్యత్తులో అవసరమయ్యే విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు,  విద్యుత్ మౌలిక వసతుల అవసరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  పరిశ్రమలు ఏర్పాటయ్యే సమయంలో విద్యుత్ సరఫరా మౌలిక వసతుల కొరత కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  అలాగే సెజ్‌లో రాబోయే ప్రతి పరిశ్రమకు సంబంధించి అంచనా విద్యుత్ లోడ్, కనెక్టెడ్ లోడ్, గరిష్ట డిమాండ్, పరిశ్రమ ప్రారంభమయ్యే సమయం, దశలవారీగా పెరగనున్న విద్యుత్ అవసరాలు వంటి వివరాలను సేకరించి సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.  ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విద్యుత్ మౌలిక వసతులను పటిష్టంగా ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక పెట్టుబడులకు ప్రోత్సాహం, కొత్త పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల పెంపు మరియు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని శ్రీ కె. గురవయ్య పేర్కొన్నారు.  పరిశ్రమల ప్రతినిధులు కూడా తమ భవిష్యత్ ప్రణాళికలు, విద్యుత్ అవసరాలు మరియు ఎదురయ్యే సాంకేతిక అంశాలను డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  ఈ సమావేశంలో నెల్లూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.