ఇడుపులపాడులో పోలీసుల కవాతు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామంలో ఇంకొల్లు సి.ఐ ఎం. రామ్ నాయక్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది భాగస్వామ్యంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా, ప్రజలతో మమేకమై, ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా చూసేందుకు పాటించాల్సిన ఎన్నికల సంబంధిత మార్గదర్శకాలు మరియు సూచనల గురించి సి.ఐ ప్రజలకు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల తంతు పూర్తి చేయాలని కోరారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.