BREAKING
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం కొత్త అనుభూతిని పంచేలా 'డార్క్ చాక్లెట్'.. యూఎస్ ప్రీమియర్స్‌పై హీరో విశ్వదేవ్ రాచకొండ ఆనందం! ఎస్పీడబ్ల్యూలో బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ రేణుకా దేవి స్వప్న ను కలిసిన మున్సిపల్ కమిషనర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి

హాస్ట‌ల్ మెస్‌ల‌ను ప‌రిశీలించిన వి. సి

Select Suryaa Now
హాస్ట‌ల్ మెస్‌ల‌ను ప‌రిశీలించిన వి. సి

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల విద్యార్థుల మెస్‌ల‌ను ఏయూ అధికారులు ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. విద్యార్థుల‌కు అందించే భోజ‌న నాణ్య‌త‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. ఆహార ప‌దార్ధాల రుచి, నాణ్య‌త‌ను వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌నిఖీ చేసి, సిబ్బందికి త‌గిన సూచ‌న‌లు చేశారు. విద్యార్థులు ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో, రుచిక‌ర‌మైన ఆహారాన్ని అందించాల‌ని సిబ్బందికి సూచించారు. భోజ‌న నాణ్య‌త‌లో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని మెస్ నిర్వాహ‌కులు, కుక్‌ల‌కు ఆదేశించారు.  విద్యార్థుల‌తో స్వ‌యంగా మాట్లాడి భోజ‌న నాణ్య‌త‌పై ఆరాతీసారు. మెస్‌ల‌పై ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే సంబంధిత వార్డెన్‌లు, చీఫ్ వార్డెన్‌ల దృష్టికి తీసుకురావాల‌న్నారు. అధికారులు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటార‌ని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తార‌న్నారు. విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను అధికారులు దృష్టికి తీసుకువ‌స్తే స‌త్వ‌రం ప‌రిష్కారం చేసే విధంగా అధికారులంతా ప‌నిచేస్తున్నామ‌నే విష‌యం గ‌మ‌నించాల‌న్నారు. విద్యార్థులు అధికారుల‌కు స‌హ‌క‌రిస్తూ మెస్‌ల నిర్వ‌హ‌ణ మ‌రింత మెరుగుప‌ర‌చే దిశ‌గా స‌మిష్టిగా కృషిచేయాల‌న్నారు. వీసీ వెంట ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వెంక‌ట సుబ్బ‌య్య‌, రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.