BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

గుడిపాటి సౌజన్యకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం

Select Suryaa Now
గుడిపాటి సౌజన్యకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: విజయవాడ నగరంలో గత 27 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామరక్ష అని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం 1వ డివిజన్ ఊర్మిళ నగర్‌లోని కృష్ణ హోటల్ కట్ట నుంచి ఎన్డీఏ కూటమి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, డివిజన్ టీడీపీ అభ్యర్థి గుడిపాటి సౌజన్యను గెలిపించాలని ప్రజలను కోరారు.

సామాజిక పింఛన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సింగ్‌నగర్‌లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఇళ్ల పట్టాల సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిష్కారం చూపామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 1వ డివిజన్ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న గుడిపాటి సౌజన్యకు ఓటు వేసి గెలిపించాలని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.