BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

గుడిపాడు జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Select Suryaa Now
గుడిపాడు జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

దువ్వూరు,మేజర్ న్యూన్ :దువ్వూరు మండలం గుడిపాడు జెడ్పీ హైస్కూల్ పూర్వ 1992-1993 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య గుడిపాడు కొత్త రామాలయంలో నిర్వహించారు. 33 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను తిరిగి కలుసుకోవడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. పాఠశాలలో గడిపిన మధుర క్షణాలు, ఉపాధ్యాయులతో ఉన్న అను బంధం, స్నేహితులతో పంచుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాము చేస్తున్న పనులు, జీవితంలో సాధించిన విజయాలనుఒకరితోఒకరు పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మార్గంచూపిన ఉపాధ్యాయుల సేవలను ఈసంద ర్భంగా గుర్తుచేసుకున్నారు. పాత స్నేహబంధాలను ఎల్లప్పుడూ కొనసాగిస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతంచేస్తూ, పాఠశాలరోజుల మధుర జ్ఞాపకా లనుమళ్లీ గుర్తుచేసిన ఆత్మీయ వేడుకగా నిలిచింది. ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఒక చోటికి చేరుకొని అందరి కష్ట సుఖాలను తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వపు  విద్యార్థులు అన్నారు.ఉపాధ్యాయులు కర్నాటి యల్లారెడ్డి, జయరామయ్య, పుల్లారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మిట్టా రవికుమార్ రెడ్డి, కోగటం వీరారెడ్డి, సారుకొల్ల కొండయ్య,వెన్నపూస సాంబశివరెడ్డి, భూమిరెడ్డి పల్లె మాధవరెడ్డి, నాగదస్తగిరి రెడ్డి, శివరామిరెడ్డి,భవాని, మంజుల, వెంకట లక్షుమ్మ తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్:బోర్రా శివరామిరెడ్డి మైదుకూరు ఇంచార్జ్ కడప జిల్లా