BREAKING
దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ రొంగల అనూష

Select Suryaa Now
గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి   మున్సిపల్ చైర్ పర్సన్ రొంగల  అనూష

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్: గ్రంథాలయాలను దేవాలయంగా చూసుకొని విద్యార్థులందరూ విజ్ఞానాన్ని పెంపొందించు పోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ రొంగల అనూష అన్నారు. స్థానిక శాఖా గ్రంధాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి చైర్ పర్సన్ అనూష మాట్లాడుతూ దేశ ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బాలలంటే చాలా ఇష్టం గనుక ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.గ్రంథాలయం అభివృద్ధికి సహకరిస్తానన్నారు. బాలలు ఎక్కువగా ఫోన్ కు అలవాటు పడుతున్నారని, ఆ అలవాటును విడనాడి పుస్తక పఠన కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నుండి లక్షలాది రూపాయలు గ్రంథాలయం పెన్సు జమ చేయవలసి ఉందన్నారు. గ్రంథాలయ భవనంకు కనీసం సున్నాలు వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. పైకప్పు నుండి వర్షం కురుస్తోందని తెలిపారు. గ్రంథాలయం కు విలువైన పుస్తకాలు సమకూర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు రొంగల దేవి ప్రసాద్,గొల్లపూడి శ్రీదేవి,భవన స్థలదాత బుగ్గ హేమ తులసి, డైరెక్టర్స్ ఇనుముల వెంకట పాపారావు, గుళ్ళపూడి వెంకట కామరాజు, గ్రంథాలయ అధికారి పి.దుర్గారావు,సీఎం రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్ పర్సన్ గ్రంథాలయంలో ఉన్న గ్రంధాలు పుస్తకాలు చదువదులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.