BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

గ్రీన్ బెల్ట్ లో వెలిసిన ఆలయం.. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం

Select Suryaa Now
గ్రీన్ బెల్ట్ లో వెలిసిన ఆలయం.. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణం

 అక్కయ్యపాలెం, సూర్య : నగరంలో జాతీయ రహదారి పొడవునా ఉన్న గ్రీన్ బెల్ట్ ప్రాంతం ఏదో ఒక చోట ఆక్రమణ గురవుతూనే ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఇలాంటి ఆక్రమణే  జాతీయ రహదారిపై బిర్లా కూడలి దాటాక  లక్ష్మి నగర్ వద్ద చోటు చేసుకుంది. గ్రీన్ బెల్ట్ ప్రాంతం లో పిల్లల పార్క్ కోసం కేటాయించిన స్థలంలో  గత కొద్ది రోజులుగా గోడలు నిర్మించి షెడ్డు కట్టి అందులో దుర్గాదేవి మాత విగ్రహం ఏర్పాటు చేసి శరన్నవరాత్రి పూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
63 వ వార్డు లక్ష్మీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పూజా కార్యక్రమాలకు భారీగా వసూళ్లు చేసేందుకు కమిటీ సభ్యులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
అయితే ఈ దుర్గాదేవి ఆలయం కడుతున్న విషయం ఆరు నెలల క్రితమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసారు.
చివరికి పిజిఆర్ఎస్ లో పీర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గోడ నిర్మించి శాశ్వతంగా షెడ్డు ఏర్పాటు చేసి దేవి విగ్రహానికి రంగులు కూడా వేసి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేసుకున్నారు. జాతీయ రహదారినానుకొని ఇంత పబ్లిక్ గా ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
దుర్గాదేవి దర్శనానికి భక్తులు వస్తుండడంతో  ఆ ప్రాంతం రద్దీగా మారింది. చిన్న రోడ్డు కావడంతో పార్కింగ్ సమస్యతో పాటు రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.  
. ఆ స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకే ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శాశ్వతంగా గుడి నిర్మించినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు. పిల్లల పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమణ చేయడం దారుణమని, అధికారులకు తెలిసే ఈవిధంగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోవటం లేదని, ఈ షెడ్ను వెంటనే తొలగించకపోతే ఈ రోడ్లో రాకపోకలు కూడా సాధ్యం కాదని, ఇబ్బందులు వస్తాయని, గ్రీన్ బెల్ట్ ఆక్రమణలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : బి. రామకృష్ణ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం.