BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునీఠా

Select Suryaa Now
గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునీఠా

గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునీఠా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  రాష్ట్ర రాజధాని నుంచి గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
       
      ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్  విడుదలైన నాటి నుంచి 14 రోజుల్లో ప్రక్రియ మొత్తం ముగించాల్సి ఉంటుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ 16 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలలోను నియమించిన గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో వైస్ చైర్మన్ ఎన్నిక నూతనంగా జరగనుందన్నారు. తాజాగా విడుదలైన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రి రాష్ట్రం నుంచి కొంత పంపుతామని, మిగిలినవి జిల్లాలలోనే కొనుగోలు చేసుకోవాలన్నారు. సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని పోలీసుల బందోబస్తు, భద్రతా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. 
      
     గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశలుగా జరుగుతాయని అనిల్ చంద్రపునీఠా తెలిపారు. ఇందు కొరకు వెబ్ కాస్టింగ్ పక్కాగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, కౌంటింగ్ సెంటర్లు ముందస్తుగా గుర్తించాలన్నారు. స్ట్రాంగ్ రూములకు ప్రోటోకాల్ పాటించాలన్నారు. లా అండ్ ఆర్డర్ పక్కాగా అమలయ్యేలా కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జోనల్ ఆఫీసర్లను సౌలభ్యం మేరకు నియమించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
     
      స్థానిక సంస్థల ఎన్నికలు మూడో దశలో నిర్వహించడానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఉందని, ఎన్నికల కొరకు కనీసం ఇద్దరిని తక్షణమే నియమించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్ట్ ఖాళీగా ఉందని, తక్షణమే నియమించాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళిక రూపొందించుకున్నామని వివరించారు. 
          
         ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.