గ్రామాల అభివృద్ధి కూటమితోనే సాధ్యం......
వరికుంటపాడు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థ ఎన్నికలలో తనను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బిజెపి జడ్పిటిసి సభ్యురాలు హరితమ్మ కోరారు. ఆదివారం వరికుంటపాడు, కనియం పాడు గ్రామాలలో ముమ్మరంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరికుంటపాడు మండలం లోని కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రత్వంలో జరుగుతున్నా అభివృద్ది గురించి తెలియజేశారు. అలాగే గల్లి నుండి ఢిల్లీ దాకా అది కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమాని అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలాన్ని అభివృద్ధి దిశలో ముందుకు సాగిద్దామని పలువురు బిజెపి నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.