BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తా సర్పంచ్‌ అభ్యర్థిగా ఆశీర్వదించండి

Select Suryaa Now
గ్రామాభివృద్ధికి మరింత కృషి చేస్తా సర్పంచ్‌ అభ్యర్థిగా ఆశీర్వదించండి

ఉండి, మేజర్ న్యూస్:ఉండి గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గ్రామ సర్పంచ్‌గా ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి కరిమెరక నాగరాజు అన్నారు. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తన పెదనాన్న కరిమెరక సత్యంను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంతో తనకు ఉన్న అనుబంధం, గ్రామ ప్రజల పట్ల ఉన్న బాధ్యతతో ఉండి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేందుకు టిడిపి మండల అధ్యక్షునిగా తన వంతు సహకారం అందించినట్లు వివరించారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే వాటి పరిష్కారానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహకారంతో ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామంలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. యువత, మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామస్తుల సూచనలు, సలహాలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని చెప్పారు. పదవి కోసం కాకుండా గ్రామ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, తనపై నమ్మకంతో ఒక అవకాశం కల్పించాలని నాగరాజు కోరారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో ఉండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.