ఘంటసాలకు నివాళి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ప్రతి నెల ఒకటిన ఘంటసాలపై మిక్కిలి మక్కువతో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం భవాని నగర్ కూడలిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని గోపీనాథ్ ఆధ్వర్యంలో మంచి నీటితో శుభ్రపరచి, పుష్పాలతో అలంకరించి వారి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఘంటసాల అభిమాని సోమ ఉమాపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోటీచర్ తిరుమలయ్య, పోలే జనార్దన్ రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, తులసి రామ్ నాయుడు, లోక ప్రభాకర్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్రపు హనుమంతరావు, పురోహితుడు సురేష్ స్వామి పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్