BREAKING
ఆరవ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మహా యజ్ఞం - కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయో తెలుసా? అంగన్వాడీ టీచర్ నియామకాలకు…మరో అవకాశం పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత ఖైదీకి ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్ 6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా మరోసారి పెళ్లి సందడి చేసుకోనున్న యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట.. కూతురి వివాహ ముహుర్తం ఫిక్స్! బేతంచెర్ల పాఠశాలలో ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఇన్చార్జి పిటా మహిళా సంఘాలకు చెక్కులు పంపిణి..

ఘనంగా సేవా జ్యోతి యాత్ర

Select Suryaa Now
ఘనంగా సేవా జ్యోతి యాత్ర

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

 వికసిత్ భారత వైపు ప్రధానమంత్రి మోడీ పయనింప చేస్తున్నారని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పేర్కొన్నారు. బుధవారం

ముమ్మిడివరం నియోజకవర్గంలో మురమళ్లలో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో సేవా జ్యోతి బైక్ ర్యాలీ భారీ ఎత్తున చేపట్టారు. ర్యాలీలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్,  సుబ్బరాజు (బుచ్చిబాబు)  ఆధ్వర్యంలో నిర్వహించిన *“సేవా జ్యోతి యాత్ర ” విశేష స్పందన ప్రజల నుంచి కనిపించింది. స్థానిక

మురమళ్ల క్యాంపు కార్యాలయం నుంచి పురవీధులు గుండా 216 జాతీయ రహదారి మార్కెట్ సెంటర్ వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎమ్మెల్యే  దాట్ల సుబ్బరాజు  ర్యాలీగా బయలుదేరారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ కూటమి శ్రేణులు అభినందనలు తెలిపారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి ప్రవేశించి సుమారు 25 సంవత్సరాలుగా దేశ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న  మోదీ  నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ దేశాన్ని అగ్రగామిగా మోడీ నేలపాలనే లక్ష్యం పెట్టుకున్నారన్నారు. భారత్ అభివృద్ధి ప్రగతివైపు తీసుకువెళ్లడంలో ప్రపంచంలోనే అగ్ర దేశం గా రూపుదిద్దుతున్నారని జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి పేర్కొన్నారు. జై కూటమి జై భారత్ జై మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ కూటమి శ్రేణులు పెద్ద పెట్టు నినాదాలు చేశారు. మోడీజీ గుజరాత్

ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధి, సంక్షేమానికి మోడీ ఎన్నో బృహత్ కరమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మంత్రి నరేంద్ర మోదీ  అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో కీలకమని సాయి తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని, ముమ్మిడివరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు నిర్విరామ కృషితో ముందుకు తీసుకెళ్తామని సాయి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి సాకా సీతాదేవి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్,   బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరెడ్డి, వత్సవాయి రామకృష్ణంరాజు, గంజా శ్రీను, సంఘాన్ని మీరబాబు, ఏళ్ల ఉదయ్, నడింపల్లి సూరిబాబు, జనసేన నాయకులు గుద్దటి రమా కేశవ బాలకృష్ణ, జిమ్మీ, సలాది రాజా, దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగి రాజు సూరిబాబు రాజు, సొసైటీ అధ్యక్షులు చిక్కాల శ్రీనివాస్, గాదిరాజు విశ్వనాథరాజు, పలివెల త్రినాధరావు, చిలువూరీ సుబ్బరాజు, విజిల్రాజ్ , దూలీపూడి రాంబాబు, ఉప్పు వాసు, ఏలూరి మూర్తి, గాదిరాజు లక్ష్మణరాజు, సాధనాల శ్రీనివాస్, గంజా సుధాకర్, ములపర్తి నాగేశ్వరరావు, దాసరి శ్రీను,కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.