BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

గత జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం: మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

Select Suryaa Now
గత జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం: మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత విధానాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల నిర్వహణ గాలికొదిలేయబడిందని, గేట్లకు గ్రీజు పెట్టడానికి కూడా నిధులు కేటాయించని దయనీయ పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. కాలువల్లో పూడికతీత, డ్రెయిన్లలో గుర్రపుడెక్క తొలగింపును పూర్తిగా విస్మరించడం వల్ల వరదలు వచ్చినప్పుడు పంటలు నీట మునిగి రైతులు వేల కోట్ల నష్టాన్ని చవిచూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణ కోసం గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.160 కోట్ల పాత బిల్లులను విడుదల చేయడమే కాకుండా, రాబోయే రెండేళ్లలో ఓఅండ్ఎం పనుల కోసం రూ.1,320 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఇంజనీరింగ్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని దండుగగా మార్చిన గత పాలకుల విధానాలను తిప్పికొట్టి, అన్నదాతలకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలను బలోపేతం చేసి రైతుల భాగస్వామ్యంతోనే కాల్వల నిర్వహణ, నీటి పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల రక్షణ, మరమ్మతులపై ప్రత్యేక నిఘా ఉంచి రైతు సంక్షేమానికి బాటలు వేస్తున్నామని నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు.