BREAKING
మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

గాంధీనగర్‌ అడవి కాలనీలో వైద్య శిబిరం

Select Suryaa Now
గాంధీనగర్‌ అడవి కాలనీలో వైద్య శిబిరం

గూడూరు, మేజర్‌న్యూస్  :  చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దివి పాలెం-1 (గాంధీనగర్) దివిపాలెం 2 అడవి కాలనీలలో వైద్య శిబిరాలు నిర్వహించారు.  బుధవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది ఇంటింటికి తిరిగి లార్వా సర్వే చేసి డెంగి, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పైన అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరానికి డాక్టర్ లీలా కృష్ణ హాజరై రోగులు పరీక్షించి వారికి మందులు పంపిణీ చేసి తగు సూచనలు ఇచ్చారు. లార్వా సర్వేలో హెల్త్ సూపర్వైజర్ మస్తానయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. గాంధీనగర్ నందు ఏఎన్ఎం సునీత ఆశా కార్యకర్తలు నిర్మల మరియు లీలావతి అడవి కాలనీ నందు ఏఎన్ఎం స్వరూప ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మగ ఆరోగ్య కార్యకర్త నూర్ మొహుద్దీన్ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. గాంధీనగర్‌ దగ్గర అడవి కాలనీ నందు 300 ఇల్లు సర్వే నిర్వహించి అవగాహన కల్పించారు. 60 మందికి వైద్యం అందించడం నాలుగు గ్రూప్ మీటింగ్లో ఆరోగ్య విద్య బోధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లీలా కృష్ణ సూచనలు ఇచ్చారు.