గాంధీ జయంతోత్సవాల బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు
మహనీయుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
గాంధీ జయంతోత్సవాల బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం, మేజర్ న్యూస్: మహనీయుల త్యాగాలు, మహాత్మాగాంధీ ఆశయాలను భావితరాలకు తెలియజేయడం ద్వారా యువతలో స్ఫూర్తిని నింపవచ్చని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. మహాత్మాగాంధీ జయంతోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల బ్రోచర్‌ను సోమవారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.శ్రీవిజ్ఞానవేదిక, క్విట్ ఇండియా స్థూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి అక్టోబర్ 2 వరకు జయంతోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాంతి, అహింసను ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మాగాంధీ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమాల కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలు, జీవిత చరిత్రపై వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.
శ్రీనివాస్ భీమవరం