గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి
గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి!!
రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో కొలువైన గంగమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి పూజలలో భాగంగా రెండవ రోజు అయిన నేడు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి కుంకుమ అక్షింతలతో ప్రత్యేకంగా పూజ చేసి, పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.