చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కో ఆర్డినేషన్ మెంబర్. తపస్సు మురళి రెడ్డి
తిరుపతి రెవిన్యూ మేజర్ న్యూస్.
చంద్రగిరి నియోజకవర్గ జనసేనలపార్టీ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ . తపసి మురళి రెడ్డి
చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడమే మా లక్ష్యం
జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల కృషిని గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించడం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఆయన తమపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయకుండా, జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ, జనసేన జెండాను విజయగర్వంతో ఎగరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీనియర్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఐకమత్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తమపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ, క్రమశిక్షణతో, అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తామని అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని పేర్కొన్నారు.
కే రాజేష్ రిపోర్టర్ తిరుపతి