BREAKING
వేద సంప్రదాయాల పరిరక్షణే భారతీయ సంస్కృతికి పునాది –- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి 'జైలర్ 2'లో నటించడానికి మిథున్ చక్రవర్తి పెట్టిన విచిత్రమైన షరతు.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం కుందుర్పి సూర్యప్రతినిధి- అన్నపూర్ణ అవతారంలో కుందుర్పమ్మ దర్శనం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఎట్టకేలకు వేమవరం రోడ్డుకు మహర్దశ! సూర్య ప్రత్యేక కథనానికి స్పందన.. ఎమ్మెల్యే తాతయ్య చొరవతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

Select Suryaa Now
ఎట్టకేలకు వేమవరం రోడ్డుకు మహర్దశ!  సూర్య ప్రత్యేక కథనానికి స్పందన.. ఎమ్మెల్యే తాతయ్య చొరవతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే మార్గంలోని వేమవరం రోడ్డుకు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. గతంలో వచ్చిన వరదల కారణంగా కొత్త వేమవరం నుంచి పెనుగంచిప్రోలు సమీపంలోని తువ్వా కాలువ వరకు రహదారి తీవ్రంగా దెబ్బతిని, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు నాటి నుంచి నేటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోడ్డు దుస్థితి కారణంగా ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన స్థానికులు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యపై సూర్య దినపత్రికలో గతంలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ కథనంపై స్పందించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) చొరవ తీసుకున్నారు.ఎమ్మెల్యే తాతయ్య చొరవతో తాజాగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు ఊరట లభించనుంది. రహదారి నిర్మాణం పూర్తయితే వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే వాహనదారులకు ప్రయాణ కష్టాలు తగ్గడంతో పాటు రాకపోకలు సులభతరం కానున్నాయి.

ప్రజా సమస్యలపై పత్రికల కథనాలు.. అధికారుల స్పందన!

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర కీలకమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. సూర్య దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం అనంతరం రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.