BREAKING
నారాయణ సమాధానం చెప్పాలి అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలి --మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దశాబ్దాల తరబడి నివాసం ఉన్నవారికి జగనన్న ను కలిసిన మురారి తిరువెంగలాయి పల్లెలో అంగన్వాడి వారోత్సవాలు అమెరికాలో లక్కవరపుకోట వాసికి అరుదైన గౌరవం: పిల్లలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి ఎంఎల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రూప్ మాస్ కౌంటర్ భీమాళి చోరీ కేసును ఛేదించిన ఎల్.కోట పోలీసులు TSN అధ్యక్షుడిగా గంగుబూడి వాసి కోసూరి తాతారావు ఎన్నిక ఆత్మకూరు మున్సిపాలిటీ ఏ గ్రేడ్ గా తీర్చిదిద్దుతా --ఆత్మకూరు నియోజకవర్గంను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతా వర్కింగ్ జర్నలిస్టు సభ్యునిగా 'లాభాన'కు అరుదైన గౌరవం.! మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ చిన్న శ్రీను వెంట కార్యకర్త లoతా బొత్స వెంటే ఐదు పంచాయతీలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి. ​యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి జొన్నవాడలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ఎస్సీ, ఎస్టీల సమస్యలను సత్వరం పరిష్కరించాలి

Select Suryaa Now
ఎస్సీ, ఎస్టీల సమస్యలను సత్వరం పరిష్కరించాలి

అనంతపురం బ్యూరో: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో జాప్యం లేకుండా పోలీస్, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా విచారిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డివిఎంసీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత సమావేశం అంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.