BREAKING
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు పారిశ్రామికవాడలో పేదల పట్టాభిషేకం

ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలు - చేతులెత్తేసిన ఎమ్మెల్యే రోషన్‌ .. ? - స్వయంగా జోక్యం చేసుకున్న బడేటి చంటి.. ? - రెండు చోట్ల ఎన్నికలు వాయిదా

Select Suryaa Now
ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలు  - చేతులెత్తేసిన ఎమ్మెల్యే రోషన్‌ .. ?  - స్వయంగా జోక్యం చేసుకున్న బడేటి చంటి.. ?  - రెండు చోట్ల ఎన్నికలు వాయిదా

కామవరపుకోట, మేజర్‌న్యూస్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ( ఎస్ఎంసీ) రాజకీయ రంగు పులుముకున్నాయి. మంగళవారం మండలంలోని మొత్తం 55 పాఠశాలలకు గాను 53 చోట్ల ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకున్నారు. అయితే మండల కేంద్రంలో ప్రతిష్టాత్మక జడ్పీ హైస్కూల్‌ ప్లస్‌లోను, సంతపాకల దగ్గర ఉన్న ఎంపీపీఎస్‌ స్కూల్లోనూ కోరం లేని కారణంగా ఎన్నికలు జరగలేదు. హైస్కూల్‌ ప్లస్‌లో 817 ఓటర్లకు మధ్యాహ్నానికి 170 ఓటర్లే రిజిస్టర్‌ అయ్యారు. అధికార కూటమిలోని రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ చైర్మన్‌ పదవి కోసం పోటీ పడడంతో మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం వేడుక్కింది. ప్రస్తుతం ఎస్ఎంసీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ మండల క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ డాన్‌ దివాకర్‌ బొబ్బిలి, మాజీ ప్రజాప్రతినిధి వర్గం బలంగా మద్దతు ఇచ్చిన బొల్లుబోయిన ప్రసాద్‌ ఇద్దరూ స్కూల్‌ కమిటీ చైర్మన్‌ రేసులో నిలిచారు. ఎవరికి వారే ముందు రోజు గెలుపు కోసం వ్యూహాలు పన్నుతూ ప్రచారం చేసుకున్నారు. ఎస్‌.ఐ వల్లీ పద్మ నలుగురు సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. రాజకీయ నాయకులు సైతం తమ అనుచర గణాన్ని గట్టిగానే మోహరించారు. చివరకు కోరం లేక ఎన్నిక వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ ఇరు వర్గాలను సమన్వయం చేయలేకపోవడంతో జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా రంగంలోకి దిగి ఎన్నిక లేకుండా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ విషయం అటు నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియమించిన నేతల వరకు వెళ్లిందని తెలిసింది. అయినా రెండు వర్గాలు తామే గెలవాలని పంతానికి పోవడంతో చివరకు ఎన్నిక వరకు వెళ్లింది. అటు మండల కేంద్రంలోని సంతపాకల దగ్గర ఉన్న ఎంపీపీఎస్‌ స్కూల్లో 127 మందికి 32 మందే రిజిస్ట్రేసన్‌ చేసుకోవడంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. అక్కడ గ్రూపు రాజకీయాల వల్లే ఎన్నిక నిలిచిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. భావిభారత పౌరులను తయారు చేసే దేవాలయాలు అయిన పాఠశాల ఎన్నికల్లోనూ ఇలా స్థానిక ఎన్నికలను తలపించేలా రాజకీయ జోక్యాలు ఎక్కువవ్వడంతో కోట ప్రజానీకం నివ్వెరపోతున్నారు. దీనిని బట్టి మండల కేంద్రంలోని అధికార పార్టీలో గ్రూపు రాజకీయం తారాస్థాయిలో ఉందని తెలుస్తోంది. ఈ వర్గపోరు ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 

 సుభాష్ కామర్పుకోట