BREAKING
ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 తుది గడువు నమోదుకు మరో అవకాశం.. గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి! శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ షో జంపింగ్ విజేతలకు పతకాలు ప్రదానం హెచ్ పిఆర్ సిలో రెండవ నేషనల్ క్వాలిఫైయర్ సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్యామలాంబిక అమ్మవారి ఆలయం వార్షికోత్సవం పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు. మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు..:జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా

ఎన్నికల పరిశీలకులు పర్యటన

Select Suryaa Now
ఎన్నికల పరిశీలకులు పర్యటన

​విజయనగరం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చిన సాధారణ పరిశీలకులు ఎస్. తేజ్ భరత్ (కార్యదర్శి,ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు), ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్. వెంకటేష్ (ఐఎఫ్ఎస్, శ్రీకాకుళం) ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి స్థానిక ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సమాలోచనలు జరిపారు. అనంతరం విజయనగరం కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు తీరుపై కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామిని అడిగి తెలుసుకున్నారు.  చెక్-లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా లేదా అని రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బొబ్బిలిలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను కూడా పరిశీలించి, అక్కడ విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. మోడల్ కోడ్ అమలు, ఎన్నికల ఏర్పాట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. వ్యయ పరిశీలకులు వెంకటేష్ రెండు మున్సిపాలిటీల్లో అకౌంటింగ్ టీమ్ లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చుల నమోదు విషయంలో పలు సూచనలు చేశారు.

ఎన్నికల నిఘా కేంద్రాల పరిశీలన
         ​నగరంలోని పలు ప్రాంతాలలో ఎన్నికల సాధారణ పరిశీలకులు తేజ్ భరత్ నేతృత్వంలో స్థిర నిఘా బృందం (స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్) తనిఖీలు నిర్వహించింది. విజయనగరం వీటీ అగ్రహారం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నిఘా కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.