ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి కనూరి శేషు మాధవి.
గన్నవరం, మేజర్ న్యూస్.
ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన కనూరి శేషు మాధవి, రామ్ భార్య, ఎస్సీ మహిళా స్థానానికి భారతీయ జనతా పార్టీ (కూటమి) తరఫున దరఖాస్తు సమర్పించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆమె దరఖాస్తును అధికారులు స్వీకరించారు. ఈ దరఖాస్తును నంబరు 1గా నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తుల సమర్పణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పురుషోత్తమపట్నం ఎస్సీ మహిళా స్థానానికి కనూరి శేషు మాధవి దరఖాస్తు సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సూర్య రిపోర్టర్:: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణాజిల్లా.