ఎంపీటీసీ ఎన్నికల 18నామినేషన్లు ఉపసంహరణ
ఇరగవరం సూర్య న్యూస్:స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ పదవికి 82నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ చెప్పారు. వాటిలో 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.రాపాక, సూరంపూడికి చెందిన , చిట్నిడి అన్నపూర్ణ,కావలిపురంనకు చెందిన వాసంశెట్టి సింహాచలం,నూనె కృష్ణ ప్రసాద్,ఐనపర్రునకు చెందిన పిల్లి వెంకట నర్సు, ఇరగవరం.1కు చెందిన మల్లుల లక్ష్మీ,ఇరగవరం.2కు చెందిన సారిక వెంకట రమణ, ఏలేటిపాడునకు చెందిన విజ్రోతి సత్యనారాయణ, చెప్పా వెంకటరమణ,ఓగిడికి చెందిన గంటా సురేష్, దొండా వెంకట సుబ్బారావు, కత్తవపాడు,పొదలాడకు చెందిన మురాల మాణిక్యం, కంతేరుకు చెందిన మేడపాటి రమేష్ బాబు, కాకిలేరుకు చెందిన ఉన్నమట్ల సుబ్రహ్మణ్యం, కాకుల ఇల్లిందల పర్రుకు చెందిన లంకా విజయలక్ష్మి, గోటేరు-ఎర్రయిచెర్వునకు చెందిన జుత్తిగ రాజేశ్వరి, పేకేరుకు చెందిన సత్తి మంగ,వేండ్ర నాగసాయి, రేలంగి 3కి చెందిన మామిడిశెట్టి లక్ష్మీలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.
రిపోర్టర్: దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా