BREAKING
హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి హెట్రో పరిశ్రమ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం లో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు… జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా

ఏం జరుగుతుందో..!? * సిరిసహస్ర కులవివాదంపై ఉత్కంఠ *

Select Suryaa Now
ఏం జరుగుతుందో..!?  * సిరిసహస్ర కులవివాదంపై ఉత్కంఠ *

విజయనగరం బ్యూరో, సూర్య : చిన్నశ్రీను కుమార్తె సిరిసహస్ర కులవివాదంపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామసుందరరెడ్డి తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమెకు బీసీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరును సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో..దీనిపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం కలెక్టర్ ను ఆదేశిస్తూ ఈనెల 3న న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
బంతిని కలెక్టర్ కోర్టులోకి నెత్తిన సంగతి తెలిసిందే. గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండుమూడు రోజుల్లో కలెక్టర్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే, తెర్లాం జెడ్పీటీసీగా పోటీచేసిన సిరిసహస్ర జయాపజయాలు ఎలాఉన్నా, కలెక్టర్ మాత్రం తనపని తాను చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే, మంజూరైన కుల ధ్రువీకరణ పత్రంపై ఆరాతీసేపనిలో బిజీగా ఉన్న కలెక్టర్, మరోవైపు, న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇలాఉంటే, మెజారిటీ జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ గెలుపొందితే  సిరిసహస్ర జెడ్పీ చైర్మన్ రేసులో ఉండనున్నారు. పరిషత్ ఫలితాలు వెలువడి, జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీలోపు కలెక్టర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ఆలస్యమైతే, హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అందువల్ల, ఆయన త్వరగా తేల్చకతప్పని పరిస్థితి. అయితే, ఇక్కడే కలెక్టర్ ముందునుయ్యి వెనుకగొయ్యి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారవర్గాలు చెబుతున్నాయి. అటు అధికార టీడీపీ నేతలు, ఇటు న్యాయస్థానం ఆదేశాలతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారిందనేది కొందరి అభిప్రాయం. న్యాయస్థానంతో వ్యవహారమైనందున, ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనేది వారి వాదన. కానీ.. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మొత్తం రూ.6 వేల నామినేషన్ ఫీజు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశం.. ఆమె బీసీ హోదాను రద్దు చేసినట్లు మాత్రం కాదనేది న్యాయవర్గాల మనసులో మాట. దత్తత ద్వారా సిరి సహస్రకు బీసీ-డీ హోదా పొందే అర్హత ఉందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అలాగే, సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆమె రాజకీయ ప్రయాణానికి ఈ నిర్ణయం కీలక మలుపుగా మారుతుందా?ఇదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్! మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనుండగా, అందరి దృష్టి సిరి సహస్ర కులవివాదంపై ఏం జరుగుతుందోననే దానిపై కేంద్రీకృతమై ఉంది.