BREAKING
గుజరాత్‌లో ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 20వ స్వర్ణం: రెజ్లింగ్‌లో మెరిసిన అమన్ రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ యూకే ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక కేంద్రంలో భద్రతా కలకలం 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షను ధృవీకరించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణి దాడి దేవర చుట్టమల్లే పాట మార్ఫింగ్ వివాదం.. తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జర్మనీని వేధిస్తున్న వైమర్ కాలపు ముప్పు అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. శ్రీరామ్, రంగాయణ రఘు చిత్రం ఎలా ఉందంటే? గాల్లోనే గొడ్డలితో దాడి, ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన యూఏఈ పాకిస్థాన్ డిజిటల్ రంగంలో చైనా పట్టు, దీర్ఘకాల సాంకేతిక ఆధారపడటంతో సార్వభౌమాధికారానికి ముప్పు అని నివేదిక హెచ్చరిక

ఎల్‌నినో ప్రభావంతో పశువుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో పశువుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

గన్నవరం, అక్టోబర్ 3, మేజర్ న్యూస్ ప్రతినిధి. (గుర్రం ప్రసాద్).

 ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశువులు, జీవాల ఆరోగ్యం, ఉత్పాదకతను కాపాడేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల, గన్నవరం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సావరగూడెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ వై. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మేరి వైడూర్యం మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను వివరించారు. పశుసంవర్ధక శాఖ అందించే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రాంబాబు, డాక్టర్ షేక్ మస్తాన్ బి మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా మేత తీసుకోవడం తగ్గడం, పాల దిగుబడి పడిపోవడం, పునరుత్పత్తి సమస్యలు, నీటి కొరత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పశువులకు రోజంతా స్వచ్ఛమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలని, తీవ్రమైన ఎండ సమయంలో బయటకు తీసుకెళ్లకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో మేత అందించాలని సూచించారు.
డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ సమతుల్య పోషకాహారం అందించడంతో పాటు పశువుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వసంతకుమారి, పశుపోషకులు, జీవాల పెంపకందారులు, విద్యార్థినీ విద్యార్థులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.