BREAKING
జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి: వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి

ఈ నగరానికి ఏమైంది..?!

Select Suryaa Now
ఈ నగరానికి ఏమైంది..?!

విజయనగరం బ్యూరో,  సూర్య : ఇక్కడి పోరు టీడీపీ, వైసీపీగా కాకుండా అదితి వర్సస్ కోలగట్లగా జరిగిన నేపథ్యంలో జిల్లామొత్తం ఆమాటకొస్తే, ఉమ్మడి జిల్లాయావత్తూ ఆకర్షించిందనే చెప్పొచ్చు. ఇరుపార్టీలు శక్తియుక్తులు ప్రదర్శించాయి. పదునైన వ్యూహాలనే అమలుచేశాయి. అంగబలం అర్ధబలం మోహరించి ప్రచారాన్ని హోరెత్తించాయి. సర్వశక్తులు ఒడ్డాయి. నువ్వానేనా స్థాయిలో తలపడ్డాయి.పోలింగు సరళికూడా అదేస్థాయిలో ఉంటుందని పార్టీలతోపాటు ప్రజలు కూడా ఊహించారు. ఈ క్రమంలోనే ఆదివారం పోలింగు రోజున అంతటా ఒకటే ఉత్కంఠ రాజ్యమేలింది. కానీ, సమయం గడుస్తున్నకొద్దీ పోలింగు పుంజుకోకపోవడంతో పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారుల గుండెల్లో గుబులు మొదలైంది. తర్వాత ఊపందుకుంటుందని అనుకున్నా అలాంటిదేమి జరగలేదు. నత్తనడకన సాగిన పోలింగు సాయంత్రం 5 గంటల సమయానికి 59.64 శాతంవద్ద ఆగిపోయింది. ఆ సమయానికి కొన్నిచోట్ల పోలింగు కేంద్రాల గేటులోపలికి వచ్చి బారులు తీరినట్టు కనిపించినా, పోలింగు శాతాన్ని అదేమీ గొప్పగా పెంచే అవకాశం కనిపించలేదు. మందకొడి పోలింగుపై పార్టీల్లో కలవరం స్పష్టంగా కనిపించింది. ఇది మాకు అనుకూలమని టీడీపీ, వైసీపీ చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం తీవ్ర ఆందోళన గురవుతున్నాయి.మందకొడి పోలింగుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ల పునర్విభజనలో శాస్త్రీయత లోపించడమే కారణమేనని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఓట్లు వేర్వేరు డివిజన్లలో చేరడం, ఎవరి ఓటు ఎక్కడుందో తెలుసుకోడానికి నానా అవస్థలు తలెత్తడం, ఓటరు స్లిప్పుల పంపిణీలో కూడా నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతోపాటు పోలింగుశాతం పెంపు విషయంలో యంత్రాంగం విఫలమైందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజానికి, విజయనగర ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువని అనుకుంటారుగానీ, ఓటుహక్కు వినియోగంలో నిరాసక్తత ప్రదర్శించడంలో రాష్ట్రంలోని కొన్ని ముఖ్య పట్టణాలు, నగరాలకు ఏమాత్రం తీసిపోరు.గతంలో జరిగిన ఎన్నో ఎన్నికల్లో పోలింగు శాతం ఈ విషయాన్ని ధృవీకరించగా, తాజాగా కూడా అది రుజువవుతోంది. సంపన్నవర్గాలు, యువత, విద్యాధికులు సైతం ఆనవాయితీగా ఇప్పుడు కూడా ముఖం చాటేశారు.పోలింగు ముగిసే సమయానికి ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లిపోయిన ప్రైవేటు ఉద్యోగులు, ఇతర శ్రమజీవులు చేరుకొని క్యూలో నిలుచోవడంతో కొంత పరువునిలిచిందిగానీ, లేకపోతే, నగర ఎన్నికల చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయేదే.2021 మార్చి10న జరిగిన మేయర్ ఎన్నికల్లో 64.5 శాతం నమోదైంది. ఈసారి 60 శాతానికి మించేనా అన్న అనుమానాలు ఉన్నాయి. అధికారులు మాత్రం ఫైనల్ ఫిగర్ 62 వరకు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే కొంత ఊరట కలిగించే విషయమవుతుంది.ఓటుకునోటు విషయంలో జరిగిన తేడాలు కూడా పోలింగు శాతాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.మొత్తానికి, ఈసారిమునుపెన్నడూ లేనంతగా ప్రజాస్వామ్య పండగ పరిహాసానికి గురైందని ప్రజాస్వామ్య వాదులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై శ్రద్ద వహించిన యంత్రాంగం పోలింగు శాతం పెంపునకు ముందునుంచి తగిన చర్యలు చేపట్టివుంటే ఈ దుస్థితి ఏర్పడేదికాదని వారు నిష్కర్షగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాత్రి ఏడుగంటల సమయంలో కొన్ని పోలింగు బూతుల పరిధిలో ఓటర్లు క్యూలో ఉన్నట్టు వార్తలు వచ్చిన దృష్ట్యా ఈమేరకు పెరుగుతుందనేది వేచిచూడాలి.